టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న తెలంగాణ.. ఆ సినిమాలతోనే క్రేజ్!

ఒకప్పుడు సినిమాలో తెలంగాణ యాసని కేవలం కమెడియన్స్, విలన్స్ మాత్రమే ఉపయోగించేవారు.కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌లో తెలంగాణ ట్రెండ్ నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత చాలా మంది తెలంగాణ యాసపైన, తెలంగాణ సినిమాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకే మన మేకర్స్ కూడా వాటిపైనే దృష్టి పెట్టారు.

 

స్టార్ హీరోలు కూడా తెలంగాణ భాషాలో మాట్లాడే సినిమాలో నటించడం మొదలు పెట్టారు. ఒకప్పుడు నారాయణమూర్తి నటించిన ఎర్రసైన్యం సినిమా తెలంగాణ భాషతోనే వచ్చింది. ఇక ఆ తరువాత ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే వచ్చింది. ఆ తరువాత జెనరేషన్‌లో అనుష్క నటించిన రుద్రమ్మ దేవి సినిమాలో అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర సూపర్ హిట్ అయింది.

ఈ క్రమంలోనే సందీప్ వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకుండ పూర్తిగా తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. అలానే వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా లో సాయి పల్లవి అచమైన తెలుగింటి తెలంగాణ అమ్మాయిల మాట్లాడుతుంది. ఇంకా లివ్ స్టోర్, ఫాలక్ నామ దాస్, ఇస్మార్ట్ శంకర్, డిజే టిల్లు సినిమా లు తెలంగాణ భాషతోనే తెరకేక్కాయి.

ఇక రీసెంట్‌గా బలగం, దసరా సినిమాలు కూడా తెలంగాణ యాసతో, కథతో తెరకెక్కించడం జరిగింది. ఇలా తెలంగాణ కథతో తీసిన సినిమాలు అన్ని సూపర్ సెన్సేషన్ గా మారుతున్నాయి. అందుకే స్టార్ హీరోలు కూడా ఈ నేపథ్యంలో సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిబట్టి చూస్తే టాలీవుడ్ లో తెలంగాణ ట్రెండ్ జోరుగా నడుతుంది. అంతేకాకుండా ఆ ట్రెండ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.