ఆ రింగుల సెంటిమెంట్‌తోనే ఎన్టీఆర్ – కొర‌టాల బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతున్నారా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాల రిజల్ట్‌కు అతీతంగా ఎన్టీఆర్‌ని ఎంతో ప్రేమిస్తుంటారు. వరుస విజయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో. అపజయాలు సమయంలో కూడా ఎన్టీఆర్‌కు అంతే అండగా నిలుస్తారు. టాపిక్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటంలో తారక్ అభిమానులు ముందు ఉంటారు.

Unique locations finalised for NTR30 - Cine Chit Chat

ఇక ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ కొత్త విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్న సమయంలో ఒక వీడియో మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రమే రివిల్ చేశారు.. పక్కనే కొరటాల శివ కూడా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

NTR 30: Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on NTR 30

ఈ వీడియోలో ఎన్టీఆర్ తన చెవులకి రెండు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు. బృందావనం తర్వాత ఎన్టీఆర్ రెండు చెవి కమ్మలు పెట్టుకోవడం ఇదే మొదటిసారి.. అంటూ ఆయన అభిమానులు ఓ కొత్త తీరని బయటకి తీశారు. ఆ వీడియోలో సరైన లైటింగ్ లేకుండా హీరోని ప్రాపర్‌గా రివిల్ చేయకుండా రివిల్ చేసిన ఈ వీడియోలో అభిమానులు ఈ విషయం అబ్సర్వ్ చేయటం ఎంతో గొప్ప విషయమే.

Watch Brindavanam | Prime Video

ఎన్టీఆర్ గతంలో బాద్‌షా, ఊసరవల్లి సినిమాల్లో కూడా ఇయర్ రింగ్ ధరించాడు. కానీ ఆ సినిమాలలో ఒక చెవికి మాత్రమే.. కానీ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన బృందావనం సినిమాలో మాత్రం రెండు చెవులకి ఎన్టీఆర్ ఇయర్ రింగ్స్ తో కనిపిస్తాడు. మళ్లీ బృందావనం తర్వాత ఎన్టీఆర్ 2 ఇయర్ రింగ్స్ తో కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కి ఉన్న ఓ కామన్ పాయింట్ కొరటాల శివ.

బృందావనం సినిమాకి కొరటాల శివ రైటర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ‌ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మరో హిట్‌ని పాన్ ఇండియా రేంజ్‌లో ఇస్తుందేమో చూడాలి అంటే 2024 సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.