మ‌ర‌ద‌లితో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న దేవిశ్రీ.. ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్ర‌ట్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఫైన‌ల్ గా పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. నాలుగు ప‌దుల వ‌యసు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్త‌కుండా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా కొన‌సాగుతున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌.. గ‌తంలో కొంద‌రు హీరోయిన్ల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, అవి పుకార్లుగా నే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు సిద్ధం అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. పెద్దలు కుదిర్చిన అమ్మాయితో దేవిశ్రీ వివాహం జరగనుందట. ఇప్ప‌టికే ఇరు కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య చ‌ర్చ‌లు ముగిశాయి అట‌.

 

త్వరలో అధికారిక ప్రకటన రానుందట. ఇక పెళ్లికూతురు దేవిశ్రీ‌కి బంధువేనట. వరుసకు ఆమె మరదలు అవుతుందని చెపుతున్నారు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు. 43 ఏళ్ళ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న కంటే 17 ఏళ్లు చిన్న వ‌య‌సు అమ్మాయితో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.