గోవాలో ఎన్టీఆర్… అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తున్నాడోచ్‌..!

త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అయినా ఎన్టీఆర్ సినిమా మొదలవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ రాలేదు.. రావట్లేదు అంటూ తెగ హార్ట్ అయిపోయిన ఈ నందమూరి అభిమానులకు యంగ్ టైగర్ వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు.

NTR30 Release Date, Star Cast, Makers, Budget, Shooting & More - JanBharat Times

రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ షార్ట్ వీడియోని కూడా ఎన్టీఆర్ తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక కొరటాలతో పనిచేయడం చాలా గొప్పగా ఉంది అంటూ కామెంట్ కూడా ఇచ్చాడు.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 టీం త్వరలోనే గోవా చేరుకోబోతున్నట్లు తెలుస్తుంది.అక్కడ ఉన్న ముఖ్య నగరాలలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ప్రధానంగా ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ కూడా ఉండబోతుందట.. ఆ సాంగ్ గోవాలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

Koratala Siva NTR 30 To Start Rolling With Action Sequence: Report

దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుస అప్డేట్‌లతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.