త‌న అందాల‌తో స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెంచేసిన ప్ర‌గ్యా.. కానీ, ఏం లాభం?

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైన‌ అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరస పెట్టిన సినిమాలు చేసింది. కానీ స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోతోంది.

కెరీర క్లోజ్ అనుకుంటున్న సమయంలో ప్రగ్యా ఖాతాలో అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ పడింది. అయినా సరే ఆమె జాతకం మారలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.

దీంతో చేసేది ఏమీ లేక పలు బ్రాండ్స్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటోంది. అలాగే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తూ సంద‌డి చేస్తోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది.

తాజాగా త‌న అందాల‌తో స‌మ్మ‌ర్ హీట్ ను మ‌రించే పెంచేసే ప్ర‌య‌త్నం చేసింది. చోళీ లెహంగాలో అందంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. డీప్ నెక్ టాప్ లో క్లీవేజ్ షో చేసింది.

ప్ర‌గ్యా తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ప్ర‌గ్యా అందాల‌ను కొంద‌రు ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మ‌రికొంద‌రు ఎంతు చూపించినా ఏం లాభం అంటూ ఎద్దేవ చేస్తున్నారు.