కాళీమాత భక్తుడుగా బాలయ్య.. ఊచ కోత మరో లెవల్లోనే..!

గ‌త రెండు సంవ‌త్స‌రల నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండ‌తో మొద‌లు పెట్టిన విజ‌యప‌రంప‌ర ఈ సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహ‌రెడ్డితో మ‌రో లేవ‌ల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాల‌తోనే కాకండా బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెల‌కున్నాయి.

ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా పక్క తెలంగాణ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ గా మారింది.

తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడుగా కనిపించబోతున్నాడు.. అదే విధంగా ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంటుందట. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్‌లు అదరగొట్టబోతున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో అయన రోల్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉండనుంది.. ఇప్పటివరకు బాలయ్య అభిమానులు చూడని రోల్‌లో బాలయ్యను ఈ సినిమాలో చూడబోతున్నాం.

Balakrishna, #NBK108 Releasing For Vijayadashami - Telugu Rajyam

మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా ఉంటాయట. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తానికి బాలయ్య.. అనిల్ రావిపూడి కలయికలో ఈ సినిమా పై హైప్ తారా స్థాయికి చేరింది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను ఈఏడాది దసరాకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.