రూ. 50 కోట్లు పెట్టి తీసిన `శాకుంత‌లం`కు 3 రోజుల్లో వ‌చ్చిన వ‌సూళ్లు తెలిస్తే షాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు, నీల‌మ గుణ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రానికి యావ‌రేజ్ టాక్ ల‌భించింది. టాక్ అనుకూలంగా లేక‌పోవడంతో శాకుంత‌లం బాక్సాపీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. మొద‌టి రెండు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌నీసం రూ. 3 కోట్ల షేర్‌ను కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఇక మూడో రోజు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మూడో రోజు రూ. 46 లక్షలు షేర్ ని మాత్ర‌మే అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 65 లక్షలతో స‌రిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా శాకుంత‌లం 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 90 లక్ష‌లు
సీడెడ్: 21 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 31 ల‌క్ష‌లు
తూర్పు: 16 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 14 ల‌క్ష‌లు
కృష్ణ: 16 ల‌క్ష‌లు
నెల్లూరు: 7 ల‌క్ష‌లు
————————————
ఏపీ+తెలంగాణ‌= 2.05 కోట్లు(4.05 కోట్లు~ గ్రాస్‌)
————————————

తమిళం – 30 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా – 33 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌- 92 ల‌క్ష‌లు
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 3.60 కోట్లు(7.45 కోట్లు~ గ్రాస్)
———————————————

కాగా, రూ. 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. ఈ లెక్కన ఇప్ప‌టి వ‌ర‌కు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 15.40 కోట్లు రాబ‌డితే బాక్సాఫీస్ వ‌ద్ద శాకుంత‌లం క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కానీ, ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.