ఈ స్టార్ హీరోయిన్లు మన భారతీయులు కాదన్నా విషయం మీకు తెలుసా..?

చిత్ర పరిశ్రమ ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఇక వారికి టాలెంట్ ఉంటే చాలు చిత్ర పరిశ్రమలో అగ్ర తారలగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. ఇక మన భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అందాల ముద్దుగుమ్మలకు హిందీ పరిశ్రమలో కొదవలేదని చెప్పాలి. కొత్త కొత్త అందాల భామలు రోజుకొకరు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రం అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతూ వస్తున్నారు. అలా కొనసాగుతున్న వారిలో కొందరు భారతీయులు కాదట. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న పలువురు ముద్దుగుమ్మలో ఇతర దేశాలకు చెందిన వారట. ఇక ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే..

అలియా భట్:
ఈమె బాలీవుడ్ కి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్‌గా త‌న కేరీర్‌ను మొద‌లు పెట్టింది. ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భ‌ట్ కూతురు, అలియా భట్ బాలీవుడ్ లోనే బిజీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇక ఈమె గత సంవత్సరమే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకొని ఓ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంది. అయితే అలియా భట్ లండన్‌లో పుట్టింది అక్కడే పెరిగింది. అలియా భట్ తండ్రి మహేష్ భ‌ట్ బ్రిటీష్ నటి సోనీ రజ్దాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆలియా తల్లి లండన్ దేశస్థురాలు కావడంతో అలియా అక్కడే పుట్టి పెరిగింది. ఆలియాకి బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది.

కత్రినా కైఫ్:
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇక గ‌త‌ సంవత్సరమే కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ కూడా బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉంది. కత్రినా హాంగ్​కాంగ్​లో పుట్టి పెరిగింది.

Bollywood Actress Jacqueline Fernandez dazzles in this pictures | -

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్..ఈ అందాల తార ఈ మధ్యకాలంలోనే బాలీవుడ్ కి హీరోయిన్‌గా పరిచయమైంది. బాలీవుడ్ కి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఈమె బాగా పాపులర్ అయింది. ఈమె ఎకువగా ఐటెం సాంగ్స్ లో నటించి బాగా పాపులర్ అయింది.ఈ ముద్దుగుమ్మ శ్రీలంకకు చెందింది.

Nargis Fakhri Reveals The Real Reason Behind Taking A Career Break, Talks About Her Mental Health

నర్గీస్ ఫక్రీ
రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది నర్గీస్ ఫక్రీ.. ఈమె ఆ సినిమా తర్వాత ఆమెకు నచ్చిన సినిమాలలోనే నటిస్తూ తనకంటూ ఓ మంచి ఇమేజ్‌ను బాలీవుడ్‌లో క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మడు కూడా భారతీయ నాటి కాదు. ఈ ముద్దుగుమ్మ న్యూయార్క్ లో పుట్టి పెరిగింది. ఈమెకు అమెరికా పౌరసత్వం కలిగి ఉంది.