చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వ‌చ్చాక ఆ పేరు కాకుండా మ‌రో పేరు పెట్టుకుంటారు. అయితే కొంత‌మంది హీరోయిన్ లు న్యూమ‌రాల‌జీ ప్ర‌కారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మ‌రికొంద‌రు హీరోయిన్ ల‌పేర్ల‌ను ద‌ర్శ‌కులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మ‌లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

జయసుధ:
సీనియర్ హీరోయిన్లలో ఒకరైన జయసుధ స‌హ‌జ‌న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత‌. ఇక ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత ద‌ర్శ‌కుడు దాస‌రినారాయ‌ణ రావు ఆమె పేరును జ‌య‌సుధ‌గా మ‌ర్చారు.

జయప్రద:
సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా తన అందం అభినయంతో సీనియర్ హీరోలతో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. .అయితే జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు లలితా రాణి కానీ సినిమాల‌లోకి వ‌చ్చాకే పేరు మార్చుకున్నారు.

శ్రీదేవి:
అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. తమిళనాడులో జన్మించిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చింది. తర్వాత సీనియర్ హీరోల అందరితో నటించి అతిలోకసుందరిని బిరుదును సంపాదించుకుంది. శ్రీదేవి అసలు పేరు ఏమిటంటే శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఈమె కూడా సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరును శ్రీదేవిగా మార్చుకుంది.

I am being targeted: Jeevitha Rajasekhar- Cinema express

జీవిత రాజశేఖర్:
తలంబరాలు సినిమాతో తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన నటి జీవిత. ఈమె అసలు పేరు పద్మ. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని జీవితాగా మార్చుకుంది.

Late actress Soundarya's lookalike girl stuns netizens with pics and videos - Tamil News - IndiaGlitz.com

సౌందర్య:
తన నటనతో తన అభినయంతో తెలుగు వారికి గుర్తుండి పోయేనటి సౌందర్య. ఈమె తన సినీ కెరియర్లో 100 సినిమాలకు పైగా నటించింది. ఈమె అసలు పేరు ఏమిటంటే సౌమ్య . సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని సౌందర్యగా మార్చుకుంది.

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్ | Senior Heroine Amani says her wish is to do a movie with S S Rajamouli | TV9 ...

ఆమని:
జంబలకిడిపంబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమని. ఈమె ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు ఏమిటంటే మంజుల. సినిమాలలోకి వచ్చే ముందు ఆమనిగ తన పేరును మార్చుకుంది.

రోజా:
ఇక సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న రోజా అస‌లు పేరు కూడా రోజా కాదు. ఆమె అస‌లు పేరు శ్రీల‌తా రెడ్డి కాగా సినిమాల్లోకి వ‌చ్చాక పేరు అంత క్యాచీగా లేద‌ని సీనియ‌ర్ దివంగ‌త‌ న‌టుడు మ‌రియు రాజ‌కీయ నాయ‌కుడు శివ‌ప్రసాద్ రోజాగా మార్చార‌ట‌.

actress Rambha | ప్రమాదానికి గురైన నటి కారు.. స్వల్పగాయాలతో బయటపడ్డ రంభ-Namasthe Telangana

రంభ:
విజయవాడలో పుట్టిన రంభ దర్శకుడు వివి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈమె అసలు పేరు ఏమిటంటే విజయలక్ష్మి. సినిమాలలోకి వచ్చేముందు ఈమె తన పేరును రంభ‌గా మార్చుకుంది.

Actress Rashi Assets : ప్రముఖ టాలీవుడ్ నటి రాశి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే | senior heroine raasi assets value details here goes viral , senior heroine raasi,raasi assets,mantra ...

రాశి:
అందాల భామ రాశి తెలుగు చత్ర పరిశ్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ను మొదలుపెట్టి. తర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు ఏమిటంటే విజయలక్ష్మి. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని రాశిగా మార్చుకుంది.

Bhumika chawla telugu actress hot saree navel show photo gallery – indiancelebblog.com

భూమిక:
అందాల తార భూమిక టాలీవుడ్‌కు యువకుడు సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హిరోగా వచ్చిన ఖుషి సినిమాతో ఈమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించింది. ఈమె అసలు పేరు ఏమిటంటే రచన చావ్లా. సినిమాలలోకి వచ్చే ముందు తన పేరుని భూమికగా మార్చుకుంది.