అదే అనుప‌మ‌కు శాపంగా మారిందా.. అందుకే స్టార్ హీరోలు ఆమెను వ‌ద్దంటున్నారా?

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా గ‌త ఏడాది అనుప‌మ‌కు బాగా క‌లిసొచ్చింది. అనుప‌మ న‌టించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అలాగే అనుప‌మ న‌టించిన 18 పేజెస్‌, బ‌ట‌ర్ ఫ్లై చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

వ‌రుస విజ‌యాల నేప‌థ్యంలో అనుప‌మ ద‌శ తిరిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. యంగ్ హీరోలు త‌ప్పా స్టార్ హీరోలు ఆమె వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. అనుప‌మ‌కు ఇంత వ‌ర‌కు స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం రాలేదు. వ‌రుస హిట్స్ ప‌డినా అనుప‌మ జాత‌కం మార‌లేదు.

అయితే కెరీర్ ఆరంభం నుంచి అనుప‌మ గ్లామ‌ర్ రోల్స్ కు దూరంగా ఉంటూ వ‌స్తోంది. ప‌క్కిటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల‌ను పోషిస్తూ తెలుగింటి ఆడ‌ప‌డుచులా అల‌రించింది. అదే ఇప్పుడు అనుప‌మ‌కు శాపంగా మారింద‌ని అంటున్నారు. ఇంత వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ లో మెర‌వ‌క‌పోవ‌డంతో.. స్టార్ హీరోలు ఆమెతో రొమాన్స్ అంటేనే నో అంటున్నార‌ట‌. అందుకే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశం రావ‌డం లేద‌ని అంటున్నారు.