శోభితతో చైతూ రిలేషన్ పై స్పందించిన అఖిల్..!

అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మరొక తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళ తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ అప్పుడప్పుడు కెమెరా కంటపడడం పైగా విదేశాల్లో కూడా కనిపించడంతో నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై అటు చైతన్య, ఇటు శోభిత ఏమాత్రం స్పందించలేదు. మరొకవైపు ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నా.. కూడా గత కొద్ది రోజుల క్రితం లండన్ లో ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో బయటకు వచ్చి పలు అనుమానాలకు ఆజ్యం పోసింది.

Love Birds Naga Chaitanya and Shobitha caught together- Pic Viral

అయితే ఈ విషయాలపై నాగచైతన్య నోరు మెదపలేదు.. ఇక ఇప్పుడు అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ కి ఈ ఫోటో గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు… ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ప్రతినిధులు అఖిల్ ను ఎన్నో ప్రశ్నలతో ఇరుకున పెట్టారు. ఈ క్రమంలోనే ఒక ప్రతినిధి అఖిల్ ను ప్రశ్నిస్తూ శోభిత నాగచైతన్య డేటింగ్ గురించి ప్రశ్నలు వేయడం జరిగింది.. ఆ విలేఖరి మాట్లాడుతూ.. మీ అన్నయ్య నాగచైతన్య ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని ఇద్దరూ కలిసి హోటల్ కి కూడా వెళ్లారని వార్తలు వస్తున్నాయి కదా.. మరి మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు .. ఈ ప్రశ్నకు అఖిల్ సమాధానం చెబుతూ.. నాగచైతన్య శోభిత ఫోటో గురించి సమాధానం చెప్పకుండా.. ఆ ప్రశ్నను దాటవేస్తూ తన పరిస్థితి గురించి వివరించారు అఖిల్.

ఏజెంట్ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నా జుట్టును, బాడీ ని మెయింటైన్ చేయడమే సరిపోతుంది. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అంటూ తెలిపాడు. మరొకవైపు చైతన్య , శోభిత రిలేషన్ గురించి చెప్పకుండా దాటవేయడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.