కోడికత్తి తేలిపోయినట్లే..అన్నీ రివర్స్ అవుతున్నాయా?

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుని, టి‌డి‌పి ఓటమిని ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు..ఈ రెండు సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. వైఎస్ వివేకాని దారుణంగా హత్య చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇది చేయించింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారు..వైసీపీ అనుకూల మీడియా కూడా నారసుర రక్తచరిత్ర అని కథనాలు ఇచ్చింది. ఇక జనం కూడా అది నమ్మారు.

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో ఏం జరిగింది? ఏం జరుగుతుందో? ప్రజలకు అర్ధమవుతుంది. ఇక ఇందులో పూర్తిగా చంద్రబాబు లేరు అని, వైసీపీకి సంబంధించిన వాళ్లే ఉన్నారనే దిశగా కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు వివేకా హత్య కేసుతో వైసీపీ లబ్ది పొందింది..కానీ ఇప్పుడు అదే వైసీపీకి రివర్స్ అవుతుంది.

ఇక కోడి కత్తి..విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీను అనే వ్యక్తి..జగన్ భుజంపై కోడి కత్తితో గుచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చంద్రబాబు చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఇంతవరకు అందులో బాబు పాత్ర ఉందని తేల్చలేకపోయింది. తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చింది. విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐ‌ఏ కౌంటర్‌ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని,  తదుపరి దర్యాప్తూ అవసరంలేదని తేల్చి చెప్పింది.

అప్పుడు, ఇప్పుడూ వైఎస్‌ జగన్‌ ఆరోపిస్తున్నట్లుగా విమానాశ్రయంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న తొట్టెంపూడి హర్షవర్ధన్‌కు, ఇతర రాజకీయ పార్టీలకు దీంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు కోడికత్తి శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కానేకాదని తమ దర్యాప్తులో తేలిందని, జగన్‌, వైసీపీ నేతలు వ్యక్తం చేసిన అనుమానాలను, కుట్ర సిద్ధాంతాలను తోసిపుచ్చింది. ఇక ఈ కోడికత్తి అంశంతో గత ఎన్నికల్లో వైసీపీకి లబ్ది జరిగింది..ఇప్పుడు అది కూడా రివర్స్ అయింది.