జగన్‌కు అదే కాన్ఫిడెన్స్..వారు గెలిపించేస్తారా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చెప్పి జగన్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అధికారం రాకపోతే..కసి మీద ఉన్న టి‌డి‌పి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా జగన్ కు తెలుసు..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆయన గెలుపుని కేవలం..పథకాల లబ్దిదారుల ఓట్ల ద్వారా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

రాష్ట్రంలో 80 శాతం పైనే ప్రజలకు పథకాలు అందిస్తున్నామని, పథకాలు అందిన వారు తమకే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నారు. వారు ఓటు వేస్తే చాలు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే ధీమాతో ఉన్నారు. అందుకే ఆయన ప్రతిసారి బటన్ నోక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో తాను అన్నీ కోట్లు ఇచ్చా..ఇన్ని కోట్లు ఇచ్చా అని చెబుతూనే ఉన్నారు. తాజాగా మార్కాపురం సభలో కూడా దాదాపు 2 లక్షల కోట్లు పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు ఇచ్చానని చెబుతున్నారు. అలా మునుపు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదని, అసలు ఆ డబ్బులు ఏం చేశారో ప్రజలు నిలదీయాలని జగన్ అంటున్నారు.

అంటే జగన్ పథకాలపైనే ఆధారపడ్డారని తెలుస్తోంది. అవే గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. ఇక ఇక్కడ పథకాల అందని వారి ఓట్లు పడవని డిసైడ్ అయ్యారు. అలా పథకాలు  అందేవారు పూర్తిగా ఓట్లు వేస్తారా? అంటే అది డౌటే..ఎందుకంటే పథకాల ద్వారా డబ్బులు వచ్చినా..పన్నులు రూపంలో ఎక్కువ డబ్బులు లాగేస్తున్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది..కాబట్టి ఆ విషయాలని పరిగణలోకి తీసుకోవాలి.

అలాగే అభివృద్ధి పెద్దగా లేదు..కాబట్టి ఇవన్నీ బేరీజు వేసుకుంటే పథకాల ద్వారా గెలిచేయడం అనేది కష్టమనే చెప్పాలి. చూడాలి మరి జనం ఎలాంటి తీర్పు ఇస్తారో.