Review: రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే..?

మరాఠీలో బ్లాక్ బస్టర్ విజయం అందించిన చిత్రం నట్ సామ్రాట్.. అనే సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమిక్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Rangamarthanda (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow
రంగమార్తాండ రాఘవరావుగా (ప్రకాష్ రాజ్) సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి పైనే షోల ద్వారా లెజెండ్రి నటుడుగా పేరు తెచ్చుకొని గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే వయసు పై పడడంతో నాటకాల నుండి రిటైర్డ్ అవ్వాలని నిర్ణయించుకుంటారు. తన మిగిలిన జీవితాన్ని కుటుంబంతో గడపాలనుకుంటారు.. ఈ క్రమంలోనే రాఘవ అతని భార్య, కొడుకు, కూతురు నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. దీంతో అలా సొంత ఊరుని వెళ్ళిపోదాం అనుకుంటారు రాఘవరావు.. చివరికి అందరూ కలిశారా లేదా అనే అంశమే ఈ కథ అంశము.

Rangamarthanda' Trailer: Dramatic, effective, and touching! - Telugu News -  IndiaGlitz.com

చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మొదలవుతోంది.. టాలీవుడ్ లోని యాక్టర్స్ పరిచయం చేస్తూ నటుడిని గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టైటిల్లో చెప్పినట్లుగా.. అమ్మానాన్నల కథ అన్నట్లుగా తెలుస్తోంది. మధ్య మధ్యలో చక్రపాణి రాఘవరావు మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయట. మొదటి భాగంలో రాఘవరావు నాటకాల నుండి రిటైర్డ్ అవడం ఆ తర్వాత ఫ్యామిలీతో కాలాన్ని గడపడం తన కొడుకు కోడల నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారనే విషయాన్ని చూపించడం జరిగింది. సెకండాఫ్లో కూతురు దగ్గరికి వెళ్తే అక్కడకు కోన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత కూతురు కూడా అనుకోని పరిస్థితులలో తండ్రిని అవమానిస్తూ ఉంటుందట. చివరికి వీరి ప్రయాణం ఎలా ముగుస్తుందో అనేది సినిమా కథ.

ఈ సినిమాని కృష్ణవంశీ చాలా ఎమోషనల్ గా ముగించారని.. ఈ సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధంగా పిల్లలకి మెసేజ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలోని సన్నివేశాలు అన్నీ కూడా కన్నీళ్లు తెప్పించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రతి ఒక్కరి పాత్ర కూడా అద్భుతంగా ఉందని మళ్లీ తన నటన విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరు చూపించారని తెలుస్తోంది. ఓవరాల్ గా ఉగాది రోజున థియేటర్లోకి వస్తున్న కృష్ణవంశీ సినిమా రంగమార్తాండ ఒక అద్భుతమైన కథనం అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.