స్టార్ హీరో తాగొచ్చి మా ఇంటికి వచ్చారంటూ.. షాకింగ్ కామెంట్లు చేసిన నటి..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు పెను సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇక క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలోని మహిళలపై జరిగే వేధింపుల పైన ఎంతోమంది ఇప్పటివరకు పెదవి విప్పడం జరిగింది. మిటు ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళల పైన లైంగిక వేధింపుల చాలా వరకు తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది తారలు మాత్రం నచ్చి వెళితే తప్పులేదని అలాగని బలవంతం చేసే రైట్స్ ఎవరికీ లేవని చాలామంది తారలు ఈమధ్య కామెంట్స్ చేశారు.

A new chapter in 'Veenira Aadai' Nirmala's life - The Hindu
ఏ ఇండస్ట్రీలో నైనా వేధింపులు అనేది ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయని కొంతమంది సీనియర్ హీరోయిన్స్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. తాజాగా తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్, ప్రేమించుకుందాంరా ,భక్త ప్రహల్లాద తదితర చిత్రాలలో నటించిన సీనియర్ నటి వెన్నెరాడై నిర్మల కూడ తాజాగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇమే కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించింది.

NTR is not a hero to me .. He looks like a god: Senior actress 'Venniradai'  Nirmala
ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక పెద్ద హీరో షూటింగ్ అయిపోయాక తర్వాత తాగి తన ఇంటికి వచ్చారని డోర్ కొడుతూనే ఉన్నారని తలుపులు తీయమని చాలా సేపు అడిగారని అయితే నేను మిమ్మల్ని ఏమి చేయనని.. మీ పక్కనే పడుకొనీ వెళ్ళిపోతా అంటూ మాట్లాడారట.. కానీ తనకు భయం వేసి డోర్ తీయలేదని చాలాసేపు ఉన్న తర్వాత అతను తిరిగి వెళ్లిపోయాడని ఆ తర్వాత ఆ సినిమా నుంచి నేను తప్పుకున్నాననీ..దర్శకుడు, నిర్మాత వచ్చి తనని బ్రతిమలాడారనీ అయినా కూడా చేయనని చెప్పానని తెలిపింది నిర్మల. అయితే ఆ హీరో ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఇమే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.