ఆ విషయంలో సిగ్గుపడ్డానంటూ.. సింగర్ రిహన్నపై రాహుల్ సిప్లిగంజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

ఆస్కార్ వేదికపై నాటు నాటు తెలుగు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఆ పాటను ప్రదర్శించిన రాహుల్ సిప్లిగంజ్ తరువాత ప్రముఖ సింగర్ రిహన్నాను కలిశాడు. అయితే అనుభవాన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని, తోటి ఆస్కార్ నామినీ అయిన రిహన్న తనతో చాలా బాగా మాట్లాడిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆమె చాలా వినయంగా ఉంటుందని, ఆమెది ఎంతో మంచి మనసు అంటూ రాహుల్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.

తమ పర్ఫామెన్స్ ను మెచ్చుకున్నందుకు, ఆస్కార్ గెలుచుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపినందుకు కూడా అతను ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆమెతో ఫోటో కోసం అడగడానికి రాహుల్ మొదట బాగా సిగ్గుపడ్డాడు. దానితో ఎలా మాట్లాడాలో కూడా తెలియక తనలో తానే సతమతమయ్యాడట. కానీ లక్కీగా, ఆమే తనతో మాట్లాడటం మొదలుపెట్టిందని ఆ తర్వాత ఆమెతో కలిసి సెల్ఫీలు దిగామని రాహుల్ తెలిపాడు. రాహుల్, కాల భైరవ ఆస్కార్ గ్లోబల్ వేదికపై ప్రదర్శించడానికి నాలుగు రోజుల పాటు పాటను రిహార్సల్ చేశారు. దీపికా పదుకొణె 95వ అకాడమీ అవార్డ్స్‌కు వ్యాఖ్యాతగా వేదికపై పాటను పరిచయం చేసింది.

మొత్తం మీద రాహుల్ ఆస్కార్ వేదికపై నిల్చోని తెలుగు రాష్ట్రాలలో అందరికీ ఎంతో స్ఫూర్తిని నింపాడు. ఇకపోతే రాహుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాహుల్ కూడా చాలా వినయంగా ఉంటాడు. గ్రౌండ్ టు ఎర్త్ నేచర్‌తో ఉండే రాహుల్ బిగ్‌బాస్ లో తన మంచి ప్రవర్తనతో విన్నర్ గా కూడా నిలిచాడు.