రష్మిక ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. చాలా రోజుల తర్వాత దానికి సైన్!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కాలంలో ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఎప్పుడో పుష్ప సినిమాలో సంతకం చేసి గతేడాది డిసెంబర్లో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి అక్కడ పాటలు చేయడం, సినిమాల్లో నటించడం చేస్తూ కాలం గడిపింది. దీపిక, ఆలియా లాగా మంచి హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అది కుదరలేదేమో. నిజానికి టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే సూపర్ స్టార్ కావచ్చు. కానీ బాలీవుడ్ లో అలా కుదరదు చాలా కాంటాక్ట్స్ కావాలి. స్టార్‌డమ్‌ రావాలంటే అక్కడ చాలాకాలం పని చేయాలి. షార్ట్ టైంలో ఒకేసారి అందలం ఎక్కడం కుదరదు. ఈ విషయం బోధపడి రష్మిక మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ వైపే అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి రష్మిక చేతిలో బాలీవుడ్ మూవీ అనిమల్ ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన కాకపోయినా రష్మికకి పెద్దగా ఒరిగే ప్రయోజనాలు ఏమీ ఉండవు. టాలీవుడ్ లో ఇప్పటికే ఈ తారను దర్శక నిర్మాతలు మర్చిపోతున్నారు ఈ క్రమంలో ఆమె టాలీవుడ్లో తన స్టేటస్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ తార ఒక సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రష్మిక దర్శకుడు వెంకీ కుడుముల, భీష్మలో కలిసి పనిచేసిన నితిన్ కాంబో కలిసి ఒక మూవీకి సంతకం చేసింది. ఇంతకు ముందు వెంకీ నటించిన ఛలో సినిమాతో రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్‌లో రాణించాలనే తపనతో తెలుగు సినిమాలను తమ చేతుల్లో పెట్టుకోని చాలా మంది దక్షిణాది తారలు ఇలియానా లాగా మారారు. కాజల్, తమన్నా లాంటి వారు ఏడాదికి రెండు తెలుగు సినిమాలు చేసేలా చూసుకున్నారు. అలా వారు బాగానే తమ క్రేజ్ నిలుపుకున్నారు. రష్మిక కూడా ఇప్పుడు అదే పాటిస్తోంది.

Share post:

Latest