ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొన్న సూర్య‌.. ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌దైన టాలెంట్‌తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల ద్వారానే కాకుండా మంచి వ్య‌క్తిత్వంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ సూర్య‌కు మంచి మార్కెట్ ఉంటుంది.

ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు భార్య జోతిక‌తో క‌లిసి 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ ను స్థాపించి నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సూర్య తాజాగా ముంబైలో ఓ ల‌గ్జ‌రీ ఫ్లాట్ ను కొనుగోలు చేశార‌ట‌. బాలీవుడ్ తార‌లు, రాజ‌కీయ నాయ‌కులు నివాసం ఉండే గేటెడ్ క‌మ్యూనిటీలో దాదాపు తొమ్మ‌ది వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గ‌ల ఫ్లాట్ ను ఆయ‌న కొన్నార‌ట‌.

అన్ని సౌక‌ర్యాలతో అత్యంత విలాసంగా ఉండే ఈ ఫ్లాట్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది. ఎందుకంటే, ఈ ల‌గ్జ‌రీ ఫ్లాట్ ను సూర్య ఏకంగా రూ. 70 కోట్లు విచ్చించి కొనుగోలు చేశార‌ట‌. అంతేకాదు, త్వ‌ర‌లోనే భార్య జ్యోతిక పిల్ల‌లు దియా మ‌రియు దేవ్ ల‌తో చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ కానున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సూర్య అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.