కాజల్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని షాక్.. ఇలాగైతే చందమామ కెరీర్ అటకెక్కుడే..!

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు దాదాపు అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈమధ్య కాలంలో పెళ్లి, పిల్లల కారణంగా ఇండస్ట్రీకి కాస్త దూరం అయింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె నటించిన మొదటి చిత్రం తమిళ హారర్ కామెడీ ఘోస్టీ.

అయితే ఈ సినిమా ఆమెకి డిజాస్టర్ గా మిగిలింది. సినిమా చూసినా ప్రేక్షకులంతా నెగిటివ్ కామెంట్స్ చేసారు. మూవీలో అసలు కథే లేదని ఈ సినిమాని కాజల్ ఎలా అంగీకరించిందని చాలామంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీక్ స్టోరీ తో వచ్చిన ఇది కనీసం సినిమా కోసం ఖర్చు చేసిన సొమ్మును కూడా వసూలు చేయలేకపోయింది. అయితే ఘోస్టి సినిమా రీమేక్ ని వచ్చే వారం తెలుగులో విడుదల చేయనున్నారు. మరి తెలుగు ప్రేక్షకులైన దీనిని ఆదరిస్తారు లేక ఛీత్కరిస్తారో చూడాల్సి ఉంది.

కాజల్ మొదటి ఇన్నింగ్స్ లో చివరి సినిమా ఆచార్య. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర తొలగించబడింది. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించారు. ఆచార్య కంటే ముందు కాజల్ హే సినీమికా, ముంబై సాహ లాంటి చిత్రాలో నటించింది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఆమె కనిపించబోతుంది. అలానే నందమూరి బాలకృష్ణ చిత్రం లో కూడా కాజల్ నటిస్తుంది. ప్రస్తుతం కాజల్ మొదలుపెట్టిన తన రెండో ఇన్నింగ్స్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌ లానే అద్భుతంగా సాగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest