సీనియర్ హీరోయిన్ లంతా సైడ్ అయినట్టేనా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో వారి స్థానాలలో కొత్త హీరోయిన్లను భర్తీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే సమంత రష్మిక అలాంటి హీరోయిన్ సైతం బాలీవుడ్ లో బిజీగా అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్కడే పలు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రస్మిక కన్నడ పరిశ్రమను పూర్తిగా వదిలి వేసిందని తెలుస్తోంది. రష్మిక కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాలు చేయడం కష్టమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

South Actress Without Makeup Look Samantha Nayanthara Anushka Shetty And  Many More | पर्दे के पीछे बिना मेकअप के ऐसी दिखती हैं साउथ अभिनेत्रियां,  पहचानने में खा जाएंगे धोखा
ఇక మరొక హీరోయిన్ అనుష్క శెట్టి.. అనుష్కకు కూడా అవకాశాలు రావడం లేదని వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క బరువు కూడా పెరగడంతో మేకర్స్ ఆమె వైపు చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరొక హీరోయిన్ నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సత్తా చాటుతున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వడం లేదు.

ఇక మరొక హీరోయిన్ కీర్తి సురేష్ ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేదన్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న కెరియర్ పరంగా ఏమాత్రం హైప్ లేదు. దీంతో ఈ మధ్యకాలంలో కుర్ర హీరోయిన్ల హవా బాగా నడుస్తోంది. అలాంటి వారిలో ముఖ్యంగా శ్రీ లీల, సంయుక్త మీనన్, కేతిక శర్మ తదితర హీరోయిన్లకు అవకాశాలు బాగా వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే సీనియర్ హీరోయిన్ల హవా ముగిసినట్టే అని చెప్పవచ్చు.