ఘోరంగా మారిన ప్ర‌భాస్ ఆరోగ్యం.. విదేశాల్లో ట్రీట్‌మెంట్!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆరోగ్యంపై గ‌త కొద్ది రోజుల నుంచి అభిమానులు అందోళ‌న చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్‌, ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం కూడా సెట్స్ మీదే ఉంది. ఈ మూడు సినిమా షూటింగ్స్ ప్ర‌భాస్ గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు.

స‌రైన విశ్రాంతి లేక‌పోవ‌డంతో మొన్నామ‌ధ్య ప్ర‌భాస్ అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇంట్లోనే ఉంటూ చికిత్స్ తీసుకుని కోలుకున్నాడు. వెంట‌నే షూటింగ్స్ తో బిజీగా అయ్యాడు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న ఆరోగ్యం పాడైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆరోగ్యం ఘోరంగా మారింద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంటోనే డార్లింగ్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాల‌కు వెళ్లార‌ట‌. కొద్ది రోజులు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడ‌ట‌. అక్క‌డ చికిత్స తీసుకుంటున్నాడ‌ట‌. అలాగే మొత్తం హెల్త్ చ‌క‌ప్ చేయించుకుని పూర్తిగా కోలుకున్న త‌ర్వాత ప్ర‌భాస్ కు ఇండియాకు తిరిగిరానున్నాడ‌ని తెలుస్తోంది. అయితే అభిమానులు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ అని ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.