వెనుకబడుతున్న పవన్..బాబుపైనే భారం!

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుకబడుతున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తే అవుననే చెప్పవచ్చు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం..అప్పుడప్పుడు మాత్రమే రాష్ర్ట రాజకీయాల్లోకి రావడం వల్ల జనసేన పార్టీకి బలం అనుకున్న మేర పెరగడం లేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ, టి‌డి‌పిల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. ఈ యుద్ధంలో జనసేన కనబడటం లేదు.

ఏదో పవన్ వచ్చిన రోజు మాత్రం కాస్త జనసేన కనిపిస్తుంటుంది. ఆయన వచ్చి రెండు, మూడు రోజులు పార్టీ సమావేశాలు పెట్టి, వైసీపీపై విరుచుకుపడి వెళ్లిపోతారు. ఆ రెండు రోజులు జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది తప్ప..ఆ తర్వాత జనసేన కనబడదు. పోనీ పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా..రాష్ట్రంలో ఉన్న జనసేన నేతలు పోరాటాలు చేయవచ్చు..నియోజకవర్గాల్లో తిరగవచ్చు. కానీ ఏదో కొందరు నేతలే అలా చేస్తున్నారు తప్ప..మిగిలిన నేతలు పవన్ వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు.

కానీ జనసేన నేతల వల్ల పార్టీని బలోపేతం చేయడం కష్టం.. కాబట్టి పవన్ రంగంలోకి దిగాల్సిందే..ఆయన దిగితేనే పార్టీకి ఊపు వస్తుంది. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఓ నాలుగైదు నెలల వరకు ఆయన ఏపీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కనిపించేలా లేరు. అంటే ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉందనగా, ఆయన వారాహి బస్సు  వేసుకుని ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

అప్పుడు రావడం వల్ల జనసేనకు పూర్తి స్థాయిలో లబ్ది అనేది కష్టమే. అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటుందనే ధీమాతో పవన్ పూర్తి స్థాయిలో రాజకీయం చేయడం లేదా? అనే డౌట్ వస్తుంది. టి‌డి‌పి పొత్తు ఉంటే డౌటే లేకుండా కొన్ని సీట్లు గెలిచేస్తామనే ధీమా పవన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.