చ‌ర‌ణ్ చాలా మారిపోయాడు.. వాడిలో అదే నాకు న‌చ్చ‌దంటూ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

`ఆర్ఆర్ఆర్‌` సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెతుతున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రెటీలు చ‌ర‌ణ్ ను విష్ చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చ‌ర‌ణ్ పెద్ద కోపిష్టి అంటూ ఆయ‌న బాబాయ్‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బాంబ్ పేల్చారు.

తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగ‌బాబు.. `మా ఇంట్లో మేము ఐదుగురు బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్‌. మా అంద‌రికీ రామ్ చ‌ర‌ణ్ మొద‌టి కొడుకు. అన్న‌య్యకు పుట్టినా మేమంద‌రం సొంత బిడ్డ‌లాగా చూసుకున్నాం. చ‌ర‌ణ్ అంద‌రిలో పెద్ద‌వాడే కాదు తెలివైన‌వాడు కూడా. అలాగే ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో ప‌రిణితితో ఆలోచిస్తాడు.

 

అలాగే ఒక‌ప్పుడు చ‌ర‌ణ్ కోపిష్టిగా ఉండేవారు. బాగా ఆవేశ‌ప‌రుడు. వాడిలో నాక‌ది న‌చ్చేది కాదు. కానీ, ఇప్పుడు చాలా మారిపోయాడు. అలాగే అంద‌రూ గ‌ర్వించ‌త‌గ్గ స్థాయికి చ‌ర‌ణ్ ఎద‌గ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.