సిగ్గు విడిచిన నితిన్ హీరోయిన్.. అందాల గేట్లు ఎత్తేసిందిగా!!

ప్రముఖ నటి నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 27 ఏళ్ళ ఈ భామ ‘వజ్రకాయ’ అనే సినిమా తో కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ‘నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ప్రేక్షకులలో యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఆ తరువాత రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘అదుగో’ మూవీ లో నటించిందీ ముద్దుగుమ్మ. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్ సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

పూరి జగనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 75 కోట్లు వసూలు చేసింది. దాంతో నభా నటేష్ కెరీర్ ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ కథ రివర్స్ అయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఈ అమ్మడు వరుస ఫ్లాపులను తన కథలో వేసుకుంది. ఆమె నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిపోయాయి. ఇక నితిన్‌తో జతకట్టిన ‘మాస్ట్రో’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. దాని వల్ల ఆమెకి కలిగిన ప్రయోజనం ఏమీ లేదు.

ఇక ప్రస్తుతం నభా నటేష్ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అసలే అవకాశాలు లేక బాధపడుతున్న నభా నటేష్‌కి ఇంకో దరిద్రం తోడైయిందట. ఆమెకి ప్రమాదం జరిగి షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయిందట. దానివల్ల ఆమెకి సర్జరీ జరిగి కొన్నేళ్లు మానసికంగా, శారీరకంగా వేదనకు గురైయిందట. దానివల్ల ఆమె సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్నారట. టాలీవుడ్ దర్శకులు ఎవరు ఆమెని పట్టించుకోవడం లేదు. అందుకే ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన చేసి అవకాశాలు పట్టేయాలని అనుకుంటుంది. గ్లామర్ షో చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తోంది. నభా తీరు చూస్తుంటే గ్లామరస్ అండ్ బోల్డ్ రోల్స్ చేయడానికైనా సిద్ధం అన్నట్లు తెలుస్తుంది. మరి ఈ అమ్మడుకి అసలు అవకాశాలు వస్తాయా రావా అనేది వేచి చూడాలి.

Share post:

Latest