చివ‌ర‌కు ఆ డ‌బ్బులు కూడా దోచుకున్నారు.. నాని సంచ‌లన వ్యాఖ్య‌లు!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. నాని, కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టించాడు.

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో నాని కెరీర్ ఆరంభంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభావాల‌ను పంచుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వ‌యంకృషితో స్టార్ గా ఎదిగాడు నాని.

ఈ క్ర‌మంలోనే ఎన్నో అవమానాలు, మ‌రెన్నో చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్నాడు. `కెరీర్ స్టార్టింగ్ లో ఆఫ‌ర్ల‌ కోసం నా ఫొటో ఆల్బమ్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాను. చాలా మంది నన్ను కనీసం లోపలకు కూడా రానివ్వలేదు. కొంద‌రు ఆఫ‌ర్ల పేరుతో న‌న్ను డ్రైవ‌ర్ గా వాడుకున్నారు. మ‌రికొంద‌రు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. చివ‌ర‌కు నేను పండుగకు బట్టలు కొనుక్కుందామని దాచుకున్న డబ్బులను కూడా దోచుకున్నారు. కానీ, అవకాశాలు మాత్రం ఇప్పించలేదు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిపోయాను. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ వచ్చింది` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నాని.