“ఈ సంవత్సరం నుండి కొత్త జర్ని ప్రారంభం”..సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న బన్నీ భార్య కొత్త వీడియో..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు .. స్టార్ హీరోల భార్యలు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ కన్నా స్టార్ హీరోల కన్నా వాళ్ళ భార్యలే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . ఆ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి . ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు .

అల్లు అర్జున్ భార్యగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని ఇస్తూనే ఉంటుంది . రీసెంట్గా అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది . ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2023 కి స్నేహ రెడ్డి తన ఫిట్నెస్ గోల్స్ మార్చేస్తున్నారు అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది . ఇకపై తన లక్ష్యాలు ఇవే అంటూ ఆమె తన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసింది.

బరువు తగ్గడం కాదు శక్తివంతంగా మారడం ఇంపార్టెంట్ ..భౌతిక ఆరోగ్యానికి బదులు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనుకుంటున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . తక్కువ తినడం కాదు .. సరైన ఆహారం తీసుకోవడం ఇంపార్టెంట్ .. ఒకేసారి కఠిన కసరత్తులు చేస్తూ లావు తగ్గాలి అని అనుకోవడం కాదు.. మెల్లమెల్లగా డైలీ తన బాడీని దృఢంగా మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాను అంటూ ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చింది . దీనికి సంబంధించిన వర్కౌట్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది స్నేహ రెడ్డి . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్నేహా రెడ్డి వీడియోకి లైక్ చేస్తున్నారు . తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ బన్నీ భార్యని ఓ రేంజ్ లో అప్రిషియేట్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)