సైలెంట్ షాక్ ఇచ్చిన నిహారిక.. విడాకుల వార్తల నేపథ్యంలో సంచలన నిర్ణయం..లెటేస్ట్ పోస్ట్ వైరల్..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు . అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినిఒకరు అన్ ఫాలో చేసుకున్నారు . అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య – నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ ని ఏకంగా డిలీట్ చేసేసారు . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ ఏ విధంగా స్పందించలేదు. అయితే జొన్నలగడ్డ చైతన్య మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటే .. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తయారయింది. సోషల్ మీడియాలో విడాకులు అంటూ వస్తున్న వార్తలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . బ్యాక్ టు బ్యాక్ మంచి ప్రాజెక్టు లు పట్టేస్తున్న నిహారిక.. రీసెంట్ గా రెట్రో లుక్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది .

ఈ ఫొటోస్ లో నిహారిక చూడడానికి చాలా ముద్దుగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే .. మరి కొందరు ఇలాంటి వాటి కోసమేనా మొగుడికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అయితే మెగా డాటర్ నిహారిక ఏ మాత్రం పట్టించుకోకుండా తనదైన స్టైల్ లో ముందుకు పోతుంది . మరి కొందరు నిహారిక డేర్ నెస్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న చీమకుట్టిన్నట్లు కూడా లేకుండా తన పని తాను చేసుకో పోవడం నిజంగా గర్వించ తగ్గ విషయమే అంటూ తిడుతూనే పొగుడుతున్నారు. దీంతో నిహారిక లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)