ఫ్యాన్ డేటింగ్‌ చేయమని అడగ్గా.. హార్ట్ టచింగ్ రిప్లై ఇచ్చిన సమంత..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. గత రెండేళ్లుగా ఒకవైపు నాగచైతన్యతో విడాకుల విషయం, ఇంకోవైపు అనారోగ్య సమస్యల వల్ల చాలా సంఘర్షణలు ఎదుర్కొంది. ఇక ఇపుడిప్పుడే వాటి నుంచి బయటపడి ఇన్‌స్పైరింగ్ లేడీగా అందరి మనసు గెలుచుకుంది. నాగచైతన్యతో కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ స్థాయికి వెళ్ళింది. కానీ తొందరగానే కోలుకొని తన సినీ కెరీర్‌ని మొదలు పెట్టింది. ఆ బాధ నుంచి బయట పడడానికి వరుస సినిమాలతో బాగా బిజీ అయింది.

అంతా బాగుంది అనుకునే సమయానికి మాయసైటీస్ అనే వ్యాధి బారిన పడింది సామ్. ఆ వ్యాధి కారణంగా చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో సమంత తన అనారోగ్య పరిస్థితి గురించి చెప్తూ కంటతడి పెట్టింది. ఆమె పడిన బాధ సమంత అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకుల చేత కూడా అయ్యో పాపం సమంత అనిపించేలా చేసింది. చివరికి ఆ వ్యాధితో కూడా పోరాడి సక్సెస్ అయింది సమంత. ఇక ఇప్పుడు అన్నిటినుంచి పూర్తిగా కోలుకుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీ అయింది. అయితే ఈ రెండు సంఘటనల వల్ల సామ్ ప్రజలకు బాగా దగ్గరైందనే చెప్పాలి.

ఈ క్రమంలోనే చాలా మంది అమ్మాయిలు సామ్‌ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఆ పోస్ట్ లో సమంతని ఉద్దేశిస్తూ.. ప్లీజ్ సామ్, మీరు ఎవరితోనైనా డేటింగ్‌ చేయండి అని అడిగింది. దీనికి సమంత రియాక్షన్‌ చూసి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ లేడీ ఫ్యాన్ సమంత నటించిన శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ మాట్లాడిన ఇంటర్వ్యూ క్లిప్‌ని జోడించి ‘ ఇది నా స్థలం కాదని తెలుసు, కానీ ప్లీజ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి’ అంటూ రాసుకొచ్చింది.

వీడియో సమంతకి ట్యాగ్‌ చేస్తూ ఆమె పోస్ట్ చేయగా, దీనిపై సామ్‌ స్పందించింది. ‘మీ లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు` అని హార్ట్ ఎమోజీని పంచుకుంది. సమంత ఇచ్చిన రిప్లైకి ఆ అభిమాని ఫిదా అయిపోయి ఉండొచ్చు . కేవలం ఆ ఒక్క అభిమానినే కాదు సమంత రియాక్షన్‌ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ని ఆ సదరు అభిమాని డిలీట్‌ చేయడం గమనార్హం. చాలా మంచి అభిమానులు సమంత రియాక్షన్ చూసి నీకు మేము ఉన్నాం సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం మూవీ వచ్చే నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.