యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ద్విభాష చిత్రమిది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా చేశాడు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 12న ఈ చిత్రం విడుదల కాబోతోందని మేకర్సీ్ ఇప్పటికే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్య పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. తాజాగా కస్టడీ టీజర్ గా బయటకు వదిలారు.
`గాయ పడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది.. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి` అంటూ నాగచైతన్య డైలాగ్ తో ప్రారంభం అయిన కస్టడీ టీజర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆకట్టుకుంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, బీజీఎమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో నాగచైశన్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని టీజర్ తో స్పష్టమైంది. `నిజం ఒక థైర్యం.. నిజం ఒక సైన్యం.. ఎస్ థట్స్ ట్రూ ఇన్ మై కష్టడీ` అంటూ చివర్లతో చైతు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి కస్టడీ టీజర్ అదిరిపోవడమే కాదు.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.