ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాలు భారీగానే తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాల అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో స్టార్ హీరోల సినిమాలు అంటే ఆ హీరోల బర్త్‌డేకు మత్రమే కాకుండా పండుగల రోజున కూడా ఆ సినిమాల అప్టేట్స్‌ను విడుదల చేస్తు ఉంటారు. అభిమానులు కూడా ఏదో ఒక అప్డ్ట్ ఉండాలని కోరుకుంటు ఉంటారు. ఇప్పుడు వచ్చే ఉగాదికి పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.
ముందుగా మహేష్, త్రివివిక్రమ్ కాంబోలో వస్తున్న #ssmb28 నుంచి కూడా ఓక్రేజీ అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. మే నెల చివరిలోగా ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అవ్వనుంది. ఈ ఉగాదికి ఈ సినిమా నుంచి మహేష్ పస్ట్ లుక్ లేదా టైటిల్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.
వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న108వ మూవీ అప్డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలయ్య పాత సినిమాలకు భిన్నంగా తెలంగాణ నేపథ్యంలో రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలా నటిస్తుంది. ఉగాదికి ఓ మాంచి అప్డేట్తో రాబోతోంది.
మరో అక్కినేని యంగ్ హీరో అఖిల్ తొలిసారిగా నటించిన పాన్ ఇండియా మూవీ ఏజెంట్ కూడా వాయిదాలు పడుతూ వచ్చే నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని టీజర్, పాటలు మేకర్స్ రిలీజ్ చేయగా. ఇప్పుడు ఈ ఉగాదికి అక్కినేని అభిమానులకి ఓ సర్ప్రైజ్ ఉంది. ప్రభాస్ తొలిసారిగా బాలీవుడ్లో నటించిన ఆదిపురుష్ ఈ సంవత్సరం జూన్ 16న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి కూడా ఓ సెన్సేషనల్ అప్డేట్ ఈ ఉగాదికి రివిల్ చేయనున్నారని తెలుస్తుంది.
ఇదేవిధంగా త్రిబుల్ ఆర్ సినిమాతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ rc15 ఈ సినిమాను సౌత్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఉగాదికి ఈ సినిమా టైటిల్ విడుదల చేయనున్నారు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ కోసం కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ఈ ఉగాదికి ఎవరు ఊహించిన విధంగా ఓ భారీ మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఈ ఉగాది సినీ అభిమానులను ఏ సినిమా అప్డేట్స్ పలకరిస్తాయో చూడాలి.