టాలీవుడ్ డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు 71వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి రావడానికి తాను పడిన కష్టాలు, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, రాజకీయ జీవితంలో ఆటు పోట్లు తదితర విషయాలను ఆయన వివరించారు.
అలాగే చిరంజీవితో విభేదాలపై కూడా మోహన్ బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గత మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు స్పష్టంగా బయట పడ్డాయి. ఇదే విషయం పై మోహన్ బాబు మాట్లాడుతూ.. `నాకు చిరంజీవికి విభేదాలు ఉన్నాయని తరచుగా వార్తలు రాస్తుంటారు.
మేము ఎన్నో సార్లు కలుస్తుంటాం.. మాట్లాడుకుంటాం. భార్య భర్తల్లాగా పోట్లాడుకుని మళ్ళీ కలసిపోతుంటాం` అంటూ కామెంట్స్ చేశారు. అంతా బాగానే ఉందని కానీ చిరంజీవి నేను భార్య భర్తల్లాగా ఉంటాం అంటూ మోహన్ బాబు అన్న మాటే నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఆ పోలిక తప్పతే మరేది దొరకలేదా అంటూ నెటిజర్లు సరదాగా సెటైర్లు పేలస్తున్నారు.