ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జీవిత.. 1991లో ప్రముఖ హీరో రాజశేఖర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరం అయింది. ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. అయితే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత జీవిత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి తాజాగా జీవిత బంపర్ ఆఫర్ ను అందుకుంది.
కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో `లాల్ సలామ్` టైటిల్ తో రజినీకాంత్ ఓ చిత్రం చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక మార్చి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
అయితే ఈ చిత్రంలో రజినీకాంత్ సిస్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. ఈ పాత్ర కోసం జీవిత రాజశేఖర్ ను ఎంపిక చేసినట్లు తాజాగా మేకర్స్ పేర్కొన్నారు. జీవిత పోషించబోయే పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని.. ఆమె రీఎంట్రీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. కాగా, చెన్నైలో మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్ లో జీవిత రాజశేఖర్ కూడా పాల్గొంటున్నారు.
– Shoot to start on March 7 in Chennai
– @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot
– Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI— Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023