ఏలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్?

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం..విభిన్న ప్రజా తీర్పు వచ్చే స్థానం…ఎప్పుడు ఒకే పార్టీకి పట్టం కట్టే నియోజకవర్గం కాదు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో..అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. 1985 నుంచి అదే జరుగుతూ వస్తుంది. 1985లో ఏలూరులో టి‌డి‌పి గెలవగా, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1989 కాంగ్రెస్, 1994, 1999లో టి‌డి‌పి, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టి‌డి‌పి, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. గెలిచిన పార్టీలే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాయి.

అంటే నెక్స్ట్ ఏలూరులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ తాజా సర్వేలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే వాటిల్లో 8 స్థానాలు టి‌డి‌పి, 3 స్థానాలు జనసేన, 2 స్థానాలు వైసీపీ గెలుస్తుందని, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. అయితే వైసీపీ గెలిచే రెండు స్థానాలు వచ్చి ఏలూరు, గోపాలాపురం స్థానాలు.

అయితే ఏలూరు సెంటిమెంట్ ప్రకారం చూస్తే..అక్కడ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి.. రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏలూరులో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువ ఉంది..అదే సమయంలో టి‌డి‌పికి పెద్ద పాజిటివ్ లేదు. కాకపోతే జనసేన ఇక్కడ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది.

టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏలూరు సీటులో వైసీపీ గెలిచే ఛాన్స్ లేనే లేదని చెప్పవచ్చు. పొత్తు లేకపోతే మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది. పొత్తుపై ఆధారపడి ఏలూరు ఫలితం ఉందని చెప్పవచ్చు.