అమ‌లు కాని హామీల యాత్ర‌గా లోకేష్ పాద‌యాత్ర‌…!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాట‌లేదు. ఇంకా మ‌ద న పెల్లెలోనే కొన‌సాగుతోంది. మ‌రి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. అయితే.. ఇప్ప‌టికే ఈ యాత్ర ప్రారంభ‌మై 40 రోజులు అయిన నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

పాద‌యాత్ర హామీల యాత్ర‌గా మారింద‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంపైనా హామీ ఇస్తున్నార‌ని.. అంటున్నారు. అదే స‌మ‌యంలో రాజ్యాంగంతోనూ.. పార్ల మెంటు తోనూ ముడిప‌డిన అంశాల‌పైనా నారా లోకేష్ అల‌వోక‌గా హామీలు గుప్పిస్తున్నార‌ని.. రేపు వీటిని నెర‌వేర్చ‌క పోతే.. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుందో.. తెలుసా? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎందుకంటే.. ఉదాహ‌ర‌ణ‌కు చేనేత రంగంపై ఉన్న జీఎస్టీని తీసేస్తామ‌ని.. నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఒకే రేపు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిని అమ‌లు చేసినా మంచిదే. అయితే.. ఆ వెంట‌నే స్వ‌ర్ణ‌కారు లు కూడా ఉన్నారు. వారు కూడా చేతితో త‌యారు చేసే ఆభ‌రణాల‌పై జీఎస్టీని ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేకిస్తు న్నా రు. దీంతో రేపు వీరు కూడా నారా లోకేష్‌కు తార‌స‌ప‌డి.. వారి డిమాండ్‌ను వినిపిస్తే..ఏం చేస్తారు? అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, వ‌డ్డెర‌ల‌ను ఎస్టీల్లో చేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని త‌ర‌చుగా నారా లోకేష్ చెబుతున్నారు.కానీ, ఇది సాధ్య‌మ‌య్యేది కాదు. ఎందుకంటే ఇది పార్ల‌మెంటుచేయాల్సిన చ‌ట్టం మేర‌కు..రాష్ట్ర‌ప‌తి తీసుకునే నిర్ణ‌యం మేర‌కు ఆధార‌ప‌డి ఉంటుంది. సో.. ఇది అంత ఈజీకాద‌ని అంటున్నారు. మొత్తానికి లోకేష్‌పా ద‌యాత్ర అమ‌లు కాని హామీల యాత్ర‌గా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యంపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.