యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేసిన నటి..!!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు ఏ రేంజ్ లో పాకిపోతున్నాయి చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఆమధ్య సమంత ఒక చానల్ పై ఇలాగే పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది.చివరికి రాజీ కుదరడంతో ఆ వివాదం అక్కడికక్కడే ముగిసేయడం జరిగింది.

తాజాగా నటి హేమ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం వివాహ వార్షికోత్సవంలో తన భర్తతో ఉన్న ఫోటోలు వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసి ఫేక్ థంబ్నెయిల్ తో పెట్టి అసత్య ప్రచారణ చేస్తున్నారని ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లో పైన కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక బ్రతికున్న వారిని కూడా కొన్ని వెబ్సైట్లో చనిపోయినట్లుగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని వాటిని మూయించే దిశగా చర్యలు తీసుకోవాలని హేమ తెలియజేయడం జరిగింది..

ఇటీవలే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఉదంతాన్ని కూడా ఆమె గుర్తు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్న చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారని చివరికి తాను బ్రతికే ఉన్నానని చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది హేమ. ఇలాంటి విషయాలను ఎక్కడ రాజీ పడేది లేదని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టులో కేస్ ఫైల్ అయ్యి విచారణ సాగే వరకు పోరాటం చేస్తామని హేమ తెలియజేస్తోంది. మొత్తానికి మరొకసారి తప్పుడు కథనాలపైన సెలబ్రిటీలు బిగించినట్లుగా కనిపిస్తోంది.