పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మాళవిక మోహన్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే పవన్ నటిస్తున్న సినిమాలలో హీరోయిన్ల విషయంలో అభిమానులు కాస్త సతమతమవుతున్నారని చెప్పవచ్చు. తాజాగా నిన్నటి రోజు నుంచి హీరోయిన్ మాళవిక మోహన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ ని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలా తమిళ చిత్రాలలో ఇప్పటికే నటించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రభాష్ కు జోడిగా మారుతి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మాళవిక మోహన్ ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంపై మాళవిక మోహన్ క్లారిటీ ఇచ్చింది.. మొదటి హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నదని సెకండ్ హీరోయిన్గా మాళవిక మోహన్ ఫైనల్ చేశారంటూ వస్తున్న ప్రచారంపై ఎలాంటి వాస్తవము లేదు.. పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని నేను కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను కానీ అది ఇంకా కుదరలేదు అంటు తెలియజేసింది.

తెలుగులో ఒక మంచి సినిమాతోనే నేను మెయిన్ హీరోయిన్ గా నడుస్తున్నాను సెకండ్ లీడ్ కాదు ఇదే నా మొదటి తెలుగు సినిమా ముందు ముందు మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఆసక్తికరంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది. ఒకటి ట్వీట్ ద్వారా తాను ఒకవేళ తెలుగులో చేస్తే మెయిన్ హీరోయిన్ గా చేస్తానని కూడా చెప్పడం విశేషమని చెప్పవచ్చు.

https://twitter.com/MalavikaM_/status/1638124780049268738?s=20