పెందుర్తి సీటులో రచ్చ..ఎమ్మెల్యేకు చెక్!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ వైసీపీలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అధికార చెలాయించే విషయంలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే సీటు విషయంలో కూడా రచ్చ నడుస్తోంది. చాలా సీట్లలో ఈ పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సైతం సీటు విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుల మధ్య రచ్చ తీర్వ స్థాయిలో నడుస్తోంది.

గత ఎన్నికల్లో అదీప్ పెందుర్తి బరిలో నిలబడి..టి‌డి‌పి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై గెలిచిన విషయం తెలిసిందే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అదీప్..ప్రజా మద్ధతు పెంచుకునే విషయంలో సక్సెస్ అయినట్లు కనిపించలేదు. సరైన అభివృద్ధి చేయకపోవడం, నియోజకవర్గంలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం అదీప్‌కు మైనస్ అయ్యాయి. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు వస్తుందో లేదో అనే డౌట్ నడుస్తోంది.

ఇదే క్రమంలో గత ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయిన పంచకర్ల..వైసీపీలోకి జంప్ కొట్టారు. అలా వైసీపీలోకి వచ్చిన పంచకర్లని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియమించారు. జిల్లా అధ్యక్షుడు అయ్యాక పంచకర్ల..ఎక్కువగా పెందుర్తిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఈ సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

అయితే చివరికి పెందుర్తి సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు గాని..ఈ పోరు వల్ల ఎవరికి సీటు ఇచ్చిన వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.