కృతి శెట్టిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే!

సినీ పరిశ్రమలో గ్లామర్ షోకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అందరికీ బాగా తెలిసిందే. అందుకే హీరోయిన్లు గ్లామర్ షో విష‌యంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు. అయితే గ్లామర షో చేయకుండా టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు. ఈ జాబితాలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. అయితే తెరపై కృతి శెట్టి ఎప్పుడూ పద్ధతిగానే కనిపించింది. ఇక సోషల్ మీడియాలనూ మితి మీరి అందాల ప్రదర్శన చేసిన సందర్భాలు లేవు. కానీ, తాజాగా మాత్రం మున్నెప్పుడూ కనిపించనంత హాట్‌ లుక్ లో దర్శనమిచ్చింది.

మోకాళ్ళ పైకి ఉండే మినీ డ్రెస్ లో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది. క‌సి చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపింది. ప్ర‌స్తుతం కృతి శెట్టి లేటెస్ట్ హాట్ పిక్ సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకు జోడిగా `క‌స్ట‌డి` సినిమాలో నటిస్తోంది. అలాగే మలయాళ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాలకు ఈ అమ్మడు సైన్ చేసింది.