ద‌స‌రాకు సినిమాల జాత‌రే జాత‌ర‌… థియేట‌ర్ల వార్ త‌ప్ప‌దు…!

పండుగలు వస్తున్నాయంటే చాలు చిత్ర పరిశ్రమకు సినిమాల సీజన్ వచ్చినట్టే.. పెద్ద పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు మేకర్స్. ఈ సందర్భంలోనే ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీపడి మరి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి విజయాలను అందుకున్నాయి.

Tollywood top heroes remuneration,top tollywood actors remuneration list,  Balakrishna remuneration, Balayya Balakrishna remuneration, Chiranjeevi  Balakrishna remuneration, Pawan Kalyan remuneration, Mahesh Babu  remuneration, NTR remuneration, Prabhas ...

ఇక ఇప్పుడు మరో పెద్ద పండుగ అయిన దసరాను టార్గెట్ చేసుకునీ భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దసరా పండుగను టార్గెట్ చేసుకుని సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇవ్వనున్నారు సినీ మేకర్స్. టాలీవుడ్ బడా సినిమాలను వరుసగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

survey reveals tollywood most popular hero of 2022 is junior ntr |Tollywood  Top Hero: టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరు.. టాప్-10లో ఎవరి స్థానం ఎక్కడ...  సర్వేలో తేలిందిదే.. వినోదం News in Telugu

ఇక ఇందులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది.

Ravi Teja Balakrishna combination fix..!

అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్‌ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108వ‌ సినిమా కూడా దసరాను టార్గెట్ చేసుకుని ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక బాలయ్య కూతురుగా
యంగ్ హీరోయిన్ శ్రీ లీలా నటిస్తుంది.

Mahesh Babu-Pawan Kalyan: మహేష్‌తో మొదలైంది.. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది..  రచ్చ చేస్తున్న ఫ్యాన్స్ | Fans are demanding that Pawan Kalyan film be  released on his birthday, just like Mahesh film ...

వీటితోపాటు విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషి సినిమా కూడా దసరా పండుగకు రిలీజ్ చేయనున్నారు. వీటితోపాటు త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న మహేష్ సినిమా కూడా అదే రోజున విడుదల చేనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలలో ఎన్నీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.