ఎన్టీఆర్‌పై మరోసారి తన ప్రేమను బయట పెట్టేసిన జాన్వీ…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 ఈ మూవీని స్టార్ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు సంబంధించి అప్డేట్ కూడా ఎన్టీఆర్ తాజాగా అమీగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రివిల్ చేశాడు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుని.. వచ్చేనెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Jr. NTR Photos [HD]: Latest Images, Pictures, Stills of Jr. NTR - FilmiBeat

ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ ప్రాజెక్టుపై సంతకం కూడా చేసింది. అధికార ప్రకటన మాత్రమే ఇంకా బయటికి రావాల్సి ఉంది. తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, జాన్వీ కపూర్ తను నటించే అన్ని సినిమాల కంటే ఎన్టీఆర్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

We Can't Keep Sharing Updates On A Daily Or Hourly Basis': Jr NTR Urges  Fans To Stop Asking For Updates About NTR 30

ఈ సినిమాకు కూడా డేట్స్ ఎక్కువగానే కేటాయించింది. ఈ సినిమానే జాన్వీ కపూర్ కి తొలి పాన్ ఇండియా సినిమా అవ్వనుంది. అందుకే ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో ఆత్రుతగా ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ కోసం కొరటాల ఇప్పటికే హైదరాబాద్ దగ్గర భారీ సముద్రపు సెట్ కూడా రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో సర్వగంగా జరగనుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కొంత మైథాలాజికల్ టచ్ కూడా ఉండబోతుందట.

Janhvi Kapoor Terms Jr NTR A Legend

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన క్యారెక్టర్ కోసం తారక్ కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ ట్రై చేస్తున్నాడు. ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసారి కొరటాల ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడో చూడాలి.