కె.విశ్వనాథ్ ఖాకీ ప్యాంటు ఎందుకు ధరించేవారో తెలిస్తే అవాక్కవుతారు!

అప్పటికాలంలో అద్భుతమైన సినిమాలను తీస్తూ టాలీవుడ్‌కి ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ లేరనే వార్త ఇప్పుడు చాలామందిని డిస్ట్రబ్ చేస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలను ఇప్పటికీ చూసి ఆనందించేవారు ఎంతోమంది. ముఖ్యంగా సంగీత ప్రజలకు అతని సినిమాలు అంటే మహా పిచ్చి. అయితే ఈ దర్శకుడికి సంబంధించి చాలామందికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతను ప్యాంట్స్ ధరించడం. దీనివల్ల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.

కె విశ్వనాథ్ తన సినిమాల సెట్‌లో ఖాకీ దుస్తులు ధరించడం అందరికీ తెలిసిందే. తన మొత్తం సిబ్బందికి ఈ ఖాకీ యూనిఫాం ఇచ్చిన మొదటి భారతీయ దర్శకుడు కూడా ఇతడే. అతను తన మొదటి చిత్రం కోసమే ఖాకీ దుస్తులను ధరించాడు. అప్పట్లో సినిమా సిబ్బంది ఖాకీ షర్టులు, లాగులు ధరించారు. అహంకారం, గర్వం కలగకుండా ఉండేందుకు విశ్వనాథ్ కూడా ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడట. అంటే మిగతా అందరి సిబ్బంది తాను సమానం అని, ఈ సినిమాలో అందరి పాత్ర ఒకటేనని సింబాలిగ్గా చెప్పేటట్లు ఇలా చేశాడట. అంతేకాదు తన మొదటి సినిమా ఫెయిల్ అయితే ఇదే బ్యాకప్ ప్లాన్ అని చమత్కరించాడు కూడా . అంటే ఆ రోజుల్లో టాక్సీ డ్రైవర్లు ఈ ఖాకీ యూనిఫామ్ ధరించేవారు. కాగా సినిమా ఫెయిల్ అవుతే టాక్సీ డ్రైవర్‌గా తాను మారతానని, అందుకే ఈ డ్రెస్ ఆల్రెడీ కుట్టించుకొని ధరించడం కూడా అలవాటు చేసుకున్నానని జోక్ గా చెప్పేవాడట.

ఇకపోతే ఈ దర్శకుడు సౌండ్ రికార్డిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, 1965లో తన “ఆత్మ గౌరవం” సినిమాతో దర్శకుడిగా మారాడు. అతను తన కెరీర్ మొత్తంలో ఖాకీ దుస్తులను ధరించడం కొనసాగించాడు. అలానే అనేక క్లాసిక్ చిత్రాలను రూపొందించాడు. కె. విశ్వనాథ్ 1930లో జన్మించాడు. 92 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 3న చనిపోయాడు.