మంచు మనోజ్ రెండవ పెళ్ళి పై మౌనంగా ఉండడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు, మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి ఇలా అందరూ కూడా సినీ ఇండస్ట్రీల తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ప్రస్తుతం వీరెవరు కూడా పెద్దగా అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. వీరు తెరకెక్కించిన సినిమాలన్నీ ట్రోల్స్ గురవుతూనే ఉన్నాయి. ఇక మంచు విష్ణు , భూమా మౌనికను ఫిబ్రవరి 2వ తేదీన వివాహం చేసుకోబోతున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ గా మారాయి.

భూమా మౌనిక - మనోజ్ వివాహ ముహూర్తం ఖరారు..!? | Manchu Manoj to tie knot to  Bhuma mounika in Feb 2023, says reports-here are the details - Telugu  Oneindia
అయితే ఫిబ్రవరి 2వ తేదీ కూడా ముగిసిన తరుణంలో మనోజ్ పెళ్లి జరిగినట్టుగా కూడా ఎక్కడ వార్తలు వినిపించలేదు. గడిచిన కొద్ది రోజుల క్రితం కేవలం ఒక గుడ్ న్యూస్ వింటారంటూ మంచు మనోజ్ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా తన పెళ్లి గురించి అని అనుకున్నారు. కానీ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం మరొకసారి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యుల కారణాలవల్లే మనోజ్ మౌనిక వివాహం వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరి పెళ్లి జరగడానికి మరికొంత సమయం పడుతుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మనోజ్ ఎప్పుడు మొదలుపెట్టిన అహం బ్రహ్మాస్త్రి సినిమా కోసం అభిమానుల సైతం ఎదురుచూస్తున్నారు కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అటు పెళ్లిపైన సినిమాల పైన మంచు మనో స్పష్టత ఇస్తే బాగుంటుందని పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతోంది. మరి మంచు మనోజ్ అభిమానుల కోరిక తీరుస్తారో లేదో చూడాలి మరి.