తనపై వచ్చిన రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన రమా ప్రభ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా పేరుపొందింది కమెడియన్ రమా ప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించింది. సుమారుగా ఆరు దశాబ్దాల సినీ కెరియర్లో 1400 కు పైగా సినిమాలలో నటించి ఘనత అందుకుంది నటి రమా ప్రభ. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో కలిసి రమప్రభ చేసే సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. 1970-80 దశకంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రమా ప్రభ

Actress Rama Prabha wants road for her village
గతంలో నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్నది. అయితే వారి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు కొన్ని వేదాభిప్రాయాలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోయారు ఇక అదే సమయంలో సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి మొత్తం రమాప్రభ కోల్పోవలసి వచ్చినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రమా ప్రభ చిత్తూరు జిల్లా మదనపల్లిలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏజ్ ఎక్కువ కావడంతో ఆడప దడప సినిమాలలో కనిపిస్తున్నది. గత సంవత్సరం హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమాలో మాత్రమే కనిపించింది రమా ప్రభ.

Sarath Babu blasts Rama Prabha for cheating accusation: I was born with a  silver spoon
తాజాగా రమా ప్రభ పై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె ఆర్దిక పరిస్థితి బాగాలేదని పూర్తిగా దిగజారిపోయిందని ఏమే భిక్షం ఎత్తుకుంటోందనీ..అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.ఇవి ఎంతో మందిని కలిసి వేసింది.తాజాగా వీటిపైన స్పందించింది రమా ప్రభ. రమా ప్రభ మాట్లాడుతూ.. నేను అడుక్కు తింటున్నాను అంటూ కొంతమంది యూట్యూబ్ లో తెగ కథనాలు రాస్తున్నారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ అయిన “రమా ప్రభ ప్రయాణం “లో తన ఇంటిని స్వయంగా దగ్గరుండి చూపించింది. ఒకవేళ నేను బిక్షం ఎత్తుకొని పరిస్థితిలో ఉంటే ఇది నా ఇల్లు ఎలా అవుతుంది అంటూ తన యూట్యూబ్ చానల్స్ పై క్లారిటీ ఇచ్చింది.. అంతేకాకుండా తనకు నాగార్జున పూరి జగన్నాథ్ తదితర సెలబ్రెటీలు వారికి తోచిన సహాయం చేస్తున్నారని తెలిపింది.