ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటి ఎవరంటే..?

ఫోర్బ్స్.. ఈవారం ప్రపంచంలో అత్యధికంగా పారితోషకం అందుకునే పదిమంది ఎంటర్టైన్మెంట్ సంబంధించి వచ్చిన తారల జాబితాను వెల్లడించింది. వీరంతా కలిసి గత ఏడాది 1.3 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు తాజా మ్యాగజైన్ నివేదించింది.. టేలర్ స్విఫ్ట్ 2022లో 92 మిలియన్ డాలర్ల సంపాదించి ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం అర్జించే మహిళ ఎంటర్టైనర్ గా నిలిచింది. తన పదవ స్టూడియో ఆల్బమ్ మిడ్ నైట్ విజయం లో భాగంగా ఈ రేంజ్ లో పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ టెన్ ఎంటర్టైనర్ల ఫోర్బ్స్ జాబితాలో చేర్చబడిన మొదటి ఏకైక మహిళగా స్విఫ్ట్ టేలర్ రికార్డ్ సృష్టించింది.

టేలర్ పెర్రి, బ్రాండ్ ఫిట్, రోలింగ్ స్టోన్స్ వంటి ప్రముఖ స్టార్ హీరోలు జాబితాలో నిలవగా.. టేలర్ స్విఫ్ట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గాయకులు జెనెసిస్ 230 మిలియన్ డాలర్లు, స్టింగ్ 210 మిలియన్ డాలర్లు సంపాదించారు ఇక సంగీత స్వరాల ప్రపంచంలో టాప్ ఎర్నర్స్ గా వీరిద్దరూ నిలవడం గమనార్హం సెప్టెంబర్లో కాంగ్రర్డ్ మ్యూజిక్ గ్రూపు 300 మిలియన్ డాలర్ల సంగీత హక్కుల విక్రయంతో జెనేసిస్ 2022లో అగ్రస్థానంలో ఉన్నారు.

ఫోర్క్స్ జాబితాలోని ఇతర ప్రధాన కళాకారులలో టేలర్ షిఫ్టు 92 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఫోర్స్ కథనం ప్రకారం ఫిజికల్ రికార్డ్ సేల్స్.. స్ట్రీమింగ్ .. డిజిటల్ డౌన్లోడ్లు.. లైసెన్స్ సింక్ ద్వారా వచ్చే ఆదాయం ప్రవాహాన్ని పరిశీలించినట్లయితే గత సంవత్సరం సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్ టాప్ లో నిలిచింది.. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళ జాబితాలో కూడా స్విఫ్ట్ 79వ స్థానంలో నిలవడం గమనార్హం.