తమ్ముడు ఉన్న చోట అక్క పోరాటం..నంద్యాల సీటుపై ట్విస్ట్?

గత కొన్ని రోజులుగా నంద్యాల వైసీపీ, టీడీపీ నేతల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. శిల్పా ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిందని, అలాగే శిల్పా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, త్వరలో టీడీపీలోకి రావాలని చూస్తున్నారని అఖిల ఫైర్ అయ్యారు.

అటు శిల్పా రవి సైతం అఖిల టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో శిల్పా రవిచంద్రకిషోర్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. అయితే నంద్యాల వెళ్లకుండా అఖిలని గృహ నిర్భందం చేశారు. దీనిపై అఖిల కోర్టుకు వెళ్లారు. అయితే అటు శిల్పా కూడా ఘాటుగా స్పందిస్తూ..అఖిల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇక్కడ కొత్త చర్చ మొదలైంది. అఖిల ఆళ్లగడ్డ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు నంద్యాల బాధ్యతలు భూమా బ్రహ్మానందరెడ్డి చూసుకుంటున్నారు.

ఇక వరుసకు సోదరుడు అయ్యే బ్రహ్మానందరెడ్డి ఉన్నా సరే నంద్యాల రాజకీయాల్లో అఖిల యాక్టివ్ గా అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో బ్రహ్మానందరెడ్డి జోక్యం చేసుకోవడం లేదు. ఇక బ్రహ్మానందరెడ్డి ఉండగా అఖిల నంద్యాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కారణాలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల సీటుని తన సొంత సోదరుడు విఖ్యాత్ రెడ్డికి దక్కించుకోవాలని అఖిల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అందుకే ఆళ్లగడ్డతో పాటు నంద్యాలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. మరి చూడాలి చివరికి ఏ సీటు ఎవరికి దక్కుతుందో.