నటుడు సంతోష్ శోభన్.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్ బాబు . ఈ చిత్రంలో హీరోయిన్ గా గౌరీ జి కిషన్ నటించింది. ప్రశాంతి కుమార్ దిమ్మెల దర్శకత్వ వహించారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన సమావేశంలో నిర్మాత సుస్మిత కొణిదల మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.
సుస్మిత మాట్లాడుతూ శ్రీదేవి శోభన్ బాబు తన మనసుకు చాలా దగ్గరైన సినిమా సంతోష్.. ప్రశాంతిని అనుకోకుండా ఒక కాఫీ షాప్ లో కలిశాను అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడ వరకు వచ్చిందని తెలిపింది. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ చిత్రం అందరి మనసును ఆకట్టుకుంటుందని తెలియజేసింది.
ఎన్నో సెంటిమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ని తెలియజేస్తోంది. ఇక హీరోయిన్ గౌరీ కి తెలుగు రాకపోయినా నాతో కూర్చొని తమిళంలో అర్థం తెలుసుకొని దాన్ని తెలుగులో నేర్చుకొని మరీ నటించిందని తెలిపింది.
ఈ సినిమాలో ప్రశాంత్ ప్రాణం పెట్టి చక్కటి ఎమోషన్స్ తో ఈ సినిమాని పూర్తి చేశారని తెలియజేస్తోంది. అలాగే నాగబాబు గారు రోహిణి గారి వంటి సీనియర్స్ కూడా ఈ సినిమాలో నటించారు. గోల్డ్ బాక్స్ బ్యానర్ ముందు నేనెప్పటికీ నా వెనుక మా వారు విష్ణు మాకు ప్రొడ్యూసర్ శరణ్య సపోర్టుగా నిలిచారు ఫిబ్రవరి 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోందని తెలియజేసింది.