దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి అగ్ర స్టార్‌ల అనుబంధం మొదలైంది మాత్రం మోసగాడు సినిమాతో. శోభన్ బాబు హీరాగా వచ్చిన ఈ సినిమాలు విలన్ పాత్రకు చిరంజీవిని ఎంపిక చేశారు రాఘవేంద్రరావు.
చిరంజీవిలోని ఎనర్జీ ని టాలెంట్ ని గుర్తించిన రాఘవేంద్రరావు తొలిసారి ఆయనకు శోభన్ బాబు తో ఫైట్స్ చేసే ఛాన్స్ మరియు అతిలోకసుందరి శ్రీదేవితో డ్యూయెట్ చేసే ఛాన్స్ ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత 1980లో నటరత్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్‌కు బావమరిదిగా చిరంజీవిని నటింపజేశారు రాఘవేంద్రరావు.
మళ్లీ ఐదు సంవత్సరాలకి 1985లో చిరంజీవి హీరోగా అడివి దొంగ సినిమాతో మొదలైన వీరి బంధం ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ కాంబో పై మంచి క్రేజ్ వచ్చింది. చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో మోసగాడు సినిమాలో తన మీద నమ్మకంతో మంచి గుర్తింపు ఉన్నా క్యారెక్టర్ ఇచ్చాడు రాఘవేంద్రరావు. ఆ సమయం నుంచే చిరంజీవిని రాఘవేందర్రావు బాబాయి అని పిలిచేవారట.
చిరంజీవితో పరిచయం పెంచుకొని అతని దగ్గర నుంచి మంచి నటన రాబట్టడం కోసం చిరును బాబాయి అని ప్రేమగా పిలిచే వారట రాఘవేంద్రరావు. అలా చిన్న వయసులోనే తనకంటే పెద్దవారికి బాబాయిగా మారాడు చిరంజీవి. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు రాఘవేంద్రరావు.