మలయాళ సినిమాలను రీమేక్ చేస్తే.. తెలుగు హీరోలకు మిగిలేది ఫ్లాప్స్‌యే..

 

సాధారణంగా తెలుగు సినిమాలో కంటెంట్ కంటే ఎక్కువగా మసాలాలు ఉంటుంది. కానీ మలయాళ సినిమాలో మాత్రం కంటెంట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అందుకే మన తెలుగు డైరెక్టర్స్, నిర్మాతలు కొన్ని మలయాళ సినిమాలను రీమేక్ చేసి మన తెలుగు వాళ్ళకి చూపిస్తుంటారు. అయితే ఆ రీమేక్ సినిమాలకి కాస్త మసాలాలు జోడిస్తే ఇక్కడ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి.

గత వారం మలయాళ సినిమా అయిన కప్పేలాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే కప్పేలా కథలో ఎటువంటి మార్పులు చెయ్యకపోగా, సినిమాలోని పాత్రల ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఇంకో మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’ కి రీమేక్‌గా వచ్చిన ‘వేట’ కూడా హిట్ కొట్టలేకపోయింది. అలానే లుసిఫర్ కి రీమేక్‌గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విజయం సాధించలేదు.

అయ్యపనుమ్ కోశియుమ్‌కి రీమేక్‌గా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీగా మార్పులు చేర్పులు చేసి బీమ్లా నాయక్ సినిమాని అద్భుతంగా తీర్చి దిద్దారు. దీనిబట్టి అర్ధం అయింది ఏంటి అంటే మలయాళ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయకుండా మెరుగులు దిద్దడం వల్ల తెలుగులో మంచి విజయం సాధిస్తాయి. లేదా మలయాళ సినిమాలను ఉన్నవి ఉన్నట్లు రీమేక్ చేస్తే.. తెలుగు హీరోలకు మిగిలేది ఫ్లాప్స్‌యే!