సూర్య‌కాంతంపై విశ్వ‌నాథ్ ఫైర్‌… షాక్ ఇచ్చేలా చేసిన గ‌య్యాళీ అత్త‌…!

తెలుగు లెజెండ్రీ దర్శకులలో కే. విశ్వనాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు తెరకు అందించారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‏తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‎తో స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగాను సినీ ప్రేక్షకులను అలరించారు.

ఆయన కెరీర్లో దాదాపు 30 సినిమాలలో వివిధ రకాల పాత్రలో నటించి మెప్పించారు విశ్వనాథ్. ఎందరో దిగ్గజ నటులతో కలిసి పనిచేసిన ఆయనకు.. తెలుగు లెజెండ్రీ నటిమని గయ్యాలి అత్త సూర్యకాంతం ఆయనకు ఓ స్పెషల్ పేరు పెట్టారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన ఏ సినిమా మొదలుపెట్టిన షూటింగ్ సమయంలో ఆయన ఒంటిపై ఖచ్చితంగా ఖాకీ డ్రెస్ ఉండాల్సిందే. దానికి ఓ పెద్ద కథ కూడా ఉంది అన్నారు విశ్వనాధ్.

ముందుగా తన కెరీర్‌ను సౌండ్ ఇంజ‌నీర్‌గా మొదలుపెట్టి ఆ తర్వాత దర్శకుడుగా మారిన.. ఆ గర్వం తనకు రాకూడదని ఖాకి డ్రెస్ ధరించే వారట. ఆయన సినిమా కోసం వర్క్ చేసే కార్మికులు అందరూ కూడా ఖాకి దుస్తులే ధరించే వారిని.. వారిలో తాను కూడా ఒక్కడని ప్రతిక్షణం గుర్తుంచుకోవడానికి దర్శకుడు అనే గర్వం రాకూడదని తాను అలా ఆ డ్రెస్ ధరించే వారిని విశ్వనాథ్‌ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో నా సినిమాలకు పని చేసే మా ఆర్ట్ డైరెక్టర్‌కు నా డ్రెస్ అసలు నచ్చేది కాదు అని విశ్వనాథ్ అన్నారు. అయితే నా మొదటి సినిమా ఆడకపోతే వెంటనే టాక్సీ డ్రైవర్ గా మారిపోతా. ఆ సమయంలో కుట్టించుకోవడానికి సమయం ఉంటుందో లేదో.. ఆ సమయానికి ఓ జ‌త రెడీగా ఉంటుంది అని చెప్పా.. అది అబద్ధమైన అందులో కొంత నిజం లేకపోలేదు.

నా మొదటి సినిమా టైమ్‌లో నాకు చాలా భయం ఉండేది. అదే సమయంలో నేను వేసుకున్న ఆ డ్రెస్ ను చూసి సీనియర్ నటి సూర్యకాంతం తనకు ఓ పేరు పెట్టారని గుర్తుచేసుకున్నారు. సూర్యకాంతంతో నేను చేసే ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు నేను డైలాగ్ చెప్తున్నా వినకుండా పక్కవారితో మాట్లాడుతూ నాకు కోపం తెప్పించేది.

ఆమెకి రెండు మూడు సార్లు చెప్పిన విన‌కుండా అదే పని చేసేది. అయితే దాంతో నేను కోప్పడ్డాను. మీరు నా సినిమా కోసం వచ్చి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు మాకేం పని లేక చెప్తున్నామ.. అన్ని ఆమెపై కోప్పడ్డాను. ఆమె అప్పుడు దాంతో అబ్బో ఆయన కమాండర్ అండ్ చీఫ్ అని టైటిల్ ఇచ్చారని విశ్వనాథ్ గుర్తు చేసుకున్నారు.