బాలకృష్ణను తార‌క‌ర‌త్న కోరిన ఆ ఒక్క కోరిక ఇదే…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా బాలయ్య తన హవా చూపిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ అన్న మోహన్ కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న గత నెల 28న తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు.

Actor Taraka Ratna faints during Lokesh's padyatra

తారకరత్న వైద్య పర్యవేక్షణ మొత్తం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో కోలుకోవాలని పూజలు కూడా చేయిస్తున్నారు. తారకరత్న త్వరలోనే కోలుకుని సాధారణ మనిషి అవ్వాలని నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. ఈ సందర్భంలోనే తారకరత్నకు తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఒక సినిమాలో నటించాలని కోరిక ఉందట.

తారకరత్నను బెంగళూర్‌కు తరలిస్తాం - హీరో బాలకృష్ణ | Hero Balakrishna About  Nandamuri Taraka Ratna Health Condition Details, Hero Balakrishna  ,nandamuri Taraka Ratna , Taraka Ratna Health Condition, Taraka Ratna ...

ఇప్పటికే బాలకృష్ణతో హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ మువ్వగోపాలుడు సినిమాలో కలిసి నటించిన‌ విషయం తెలిసిందే. అన్నయ్య కళ్యాణ్ రామ్‌లా నేను కూడా బాలయ్య బాబాయ్ తో కలిసి నటించాలని చాలా సందర్భాల్లో తన మనసులోని కోరికను తారకరత్న వ్యక్తం చేశారని తెలుస్తుంది. బాలకృష్ణ సైతం తన సినిమాలలో తారకరత్నకు మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పాలని దర్శకులకు సైతం చెపుతున్నారని తెలుస్తుంది.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న  బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకుంది. మరి కొద్ది రోజుల్లోనే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌కు విలన్ గా తారకరత్నపేరును పరిశీలించారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Nandamuri Taraka Ratna critical after cardiac arrest, says hospital | The  News Minute

తారకరత్న త్వరగా కోలుకుంటే మాత్రం బాలయ్య, తారకత్న కాంబోను చూడవచ్చు అని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ పై బాలయ్య కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. తారకరత్న త్వరగా కోలుకుంటే మాత్రం ఈ కాంబినేషన్లో సినిమా చూడడానికి ఎంతో సమయం పట్టదని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.